1992నుంచి ఫస్ట్‌సింగిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పివియం జ్యోతి ఆర్ట్స్ బ్యానర్‌పై మహి రాథోడ్ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం -1992. సినిమా టైటిల్ లోగో, ఫస్ట్ సింగిల్‌ను నిర్మాత రాజ్ కందుకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ -1992 టైటిల్, ఫస్ట్‌సింగిల్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. కొత్తవాళ్లు చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ -ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మాత రాజ్ కందుకూరి లోగో, ఫస్ట్ సింగిల్‌ను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నాం అన్నాడు. నటుడు దిల్ రమేష్ మాట్లాడుతూ -యాత్ర సినిమా తరువాతి నుంచి మంచి పాత్రలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఫాదర్‌గా కనిపిస్తున్నా అన్నారు. హీరో, నిర్మాత మహి రాథోడ్ మాట్లాడుతూ -దర్శకుడు శివ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించారు. ఫస్ట్ సింగిల్ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నా అన్నారు. హీరోయిన్ మోనా ఠాగూర్ మాట్లాడుతూ -తెలుగులో నా ఫస్ట్ సినిమా ఇది. క్యారెక్టర్ చాలా ట్రెండీగా ఉంటుంది అన్నారు.