లక్కీ అనుపమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమమ్, శతమానంభవతి, అఆ, రాక్షసుడిలాంటి సినిమాలు -అనుపమలోని పెర్ఫార్మెన్స్ స్టామినాను చూపించేవే. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా -ఓవరాల్‌గా సౌత్‌ని కవర్ చేస్తోంది కనుక.. కెరీర్‌లో గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లోనూ అనుపమకు మంచి పేరే ఉంది. ఇటీవలి కాలంలో తెలుగు స్క్రీన్‌కు దూరమైన అనుపమ -త్వరలోనే ఓ అరంగేట్రం హీరోతో స్క్రీన్‌పై రొమాన్స్ చేయనుందట. నిర్మాత దిల్‌రాజు సోదరుడి కొడుకు ఆశిష్‌రెడ్డి -స్క్రీన్ హీరోయిజానికి రెడీ అవుతున్నాడు. ‘రౌడీ బాయ్స్’ టైటిల్‌ను సైతం కన్ఫర్మ్ చేసుకున్నారట. అరంగేట్రం హీరోతో రొమాన్స్ చేయడానికి అనుపమను ఎంచుకున్నారన్నది తాజా సమాచారం. అయితే, ఎస్టాబ్లిష్‌డ్ బ్యూటీ కొత్త హీరోతో జత కట్టడానికి భారీ పారితోషికమే డిమాండ్ చేసిందట. అందుకు దిల్‌రాజ్ టీం ఒకే కూడా చెప్పడంతో -త్వరలోనే సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుందన్న టాక్ వినిపిస్తోంది.