యురేక.. అనిపించేదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీక్ ఆనంద్, సయ్యద్ సోహైల్ రియాన్, డింపుల్ హయతి, షాలిని లీడ్‌రోల్స్‌లో లక్ష్మీప్రసాద్ ప్రొడక్షన్స్‌పై దర్శకుడు కార్తీక్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న చిత్రం -యురేక. సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు హాజరైన మధుర శ్రీధర్ మాట్లాడుతూ -ట్రైలర్, సాంగ్స్ చూస్తుంటే కార్తీక్ ఆనంద్ కష్టం కనిపిస్తోంది. సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, ఆర్టిస్ట్‌లకు బెస్ట్ విషెస్ అన్నారు. నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ -మంచి సినిమా నిర్మించామన్న సంతృప్తివుంది. మాకు సహకరిస్తోన్న నిర్మాతలు రాజ్ కందుకూరి, మధుర శ్రీధర్, బెక్కం వేణుగోపాల్‌కు ధన్యవాదాలు. నటిస్తూ మరోవైపు దర్శకత్వం వహిస్తూ కార్తీక్ ఆనంద్ మంచి సినిమా తీశాడు. సినిమా విజయం సాధించి అందరికీ గుర్తింపు రావాలని కోరుకుంటున్నా అన్నారు. దర్శకుడు కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ -ఈ సినిమా తీయడానికి టీం మొత్తం చాలా కష్టానే్న భరించింది. టైట్ షెడ్యూల్‌లో పని చేస్తూ నాకు పూర్తిగా సహకరించిన టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు ధన్యవాదాలు. యురేక చిత్రాన్ని చిన్న సినిమాగా ఎప్పుడూ అనుకోలేదు. మంచి సినిమా తీశానన్న సంతృప్తివుంది. నన్ను సపోర్ట్ చేసిన పేరెంట్స్ సహా ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అన్నారు.