అల్లుడు శీను.. అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెగెటివ్ టైటిల్‌తో వచ్చిన ఓ రీమేక్ -వరుస ఫ్లాపులతో సతమతమైన బెల్లంకొండ శీను ఫేట్ మార్చేసింది. అదే రమేష్‌వర్మ తెరకెక్కించిన -రాక్షసుడు. తనదైన రొటీన్ హీరోయిజాన్ని పక్కన పెట్టేసి -సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులు కొట్టేశాడు బెల్లంకొండ. కొద్దిపాటి కెరీర్‌లోనే మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగాయి కనుక -ఈసారి కథలను కొలతలేసి మరీ ఎంచుకుంటానంటూ అప్పట్లోనే చెప్పుకొచ్చాడు ఈ యంగ్ హీరో. అలా -దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌తో జతకట్టి సుమంత్ మూవీ ప్రొడక్షన్స్‌పై సుబ్రహ్మణ్యం గొర్రెలతో సినిమా మొదలెట్టాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి తాజాగా ‘అల్లుడు అదుర్స్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఇదొక క్యాచీ టైటిల్‌గా కంటే, చిత్రబృందం సెంటిమెంటే ఎక్కువ ఫీలై ఉంటుందన్న టాక్ మొదలైంది. టాలీవుడ్‌లో అల్లుడు, మొగుడులాంటి పదాలకు పాజిటివ్ సెంటిమెంటుంది. ఈ పదాలున్న సినిమాలు చాలావరకూ సక్సెసయ్యాయి కూడా. మెగాస్టార్‌గా చిరంజీవి ఎదుగుదలలో ‘అల్లుడు’ సినిమాలది చిన్న పాత్రేం కాదు. మరోపక్క బెల్లంకొండ ఫస్ట్ మూవీ ‘అల్లుడు శ్రీను’. మంచి కలెక్షన్స్ సాధించడమే కాదు, డెబ్యూ హీరోగా బెల్లంకొండకు మంచి ఫ్లాట్‌ఫాం వేసింది. ఇక అదుర్స్ అన్నది రొమాంటిక్ హీరోయిజానికి ఉపయోగించే పాజిటివ్ సైన్. ఇవన్నీ చూసుకునే -‘అల్లుడు అదుర్స్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారన్న మాట వినిపిస్తోంది. గతేడాది ఇంటెన్స్ క్రైమ్ స్టోరీ రాక్షసుడు చేసిన బెల్లంకొండ -అల్లుడు అదుర్స్ అంటూ ఈసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూపించనున్నాడు. స్మార్ట్ బ్యూటీలు నభానటేష్, అను ఇమ్మాన్యుయేల్ -ఈ సినిమాలో బెల్లంకొండతో రొమాన్స్ చేయనున్నారు. సోనూ సూద్, ప్రకాష్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తుంటే -దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చనున్నాడు. ఏప్రిల్ 30న సినిమాను థియేటర్లకు తెస్తున్నట్టు చిత్రబృందం తాజా టైటిల్ పోస్టర్‌పై ప్రకటించింది.