అనగనగా ఒక సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివ, మేఘశ్రీ జంటగా జె ప్రొడక్షన్స్ ఫిలింస్ పతాకాలపై జె.ప్రభాకర్‌రెడ్డి దర్శకత్వంలో జె.ప్రభాకర్‌రెడ్డి, కొడాలి సుబ్బారావు సంయుక్తంగా నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘అనగనగా ఒక చిత్రమ్’. డిసెంబర్ 11న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోందంటోంది ఆ చిత్రయూనిట్. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ఆడియన్స్ అభిరుచికి తగ్గట్లుగా ఓ కొత్త పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, సినిమాలో కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని, మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలని అన్నారు.
హీరో శివ మాట్లాడుతూ, ఇది మంచి కామెడీ ఎంటర్‌టైనింగ్ మూవీ అని, సాంగ్స్ పిక్చరైజేషన్, కామెడీ హైలెట్‌గా నిలిచాయని అన్నారు. హీరోయిన్ మేఘశ్రీ మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉందని, తనకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు, సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అన్నారు.