ప్రారంభమైన సిందూర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశోక్ రాయల్, అవంతిక, కీర్తిక ప్రధాన తారాగణంగా సాయి సింధూ క్రియేషన్స్ పతాకంపై పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సిందూర’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం ఉదయం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్లో జరిగింది. హీరో హీరోయిన్లపై కనకమామిడి స్వామిగౌడ్ క్లాప్‌నివ్వగా, మామిడి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శక నిర్మాత పులి అమృత్ మాట్లాడుతూ- నూతన నటీనటులతో పదవ చిత్రంగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, 25 రోజులపాటు బాచుపల్లిలో తొలి షెడ్యూల్ చేస్తామని, నాలుగైదు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో అశోక్ రాయల్, అవంతిక, తమకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కామెడీ, హారర్ మిక్స్ చేసిన ఈ చిత్రంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు మంచి స్కోప్ వుందని సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:సురేష్ గుల్లపెల్లి, కెమెరా:అమర్‌నాధ్, రచన, నిర్మాత, దర్శకత్వం:పులి అమృత్.