మళ్లీ.. ద్విభాషలో
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రీతూ వర్మ -అందమైన తెలుగమ్మాయి. బాద్‌షా, ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లిచూపులు చిత్రాల్లో తన పెర్ఫార్మెన్స్ స్టామినా చూపించిన అమ్మాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా ఇవే తప్పా, రీతూకి తెలుగులో తరువాతి చాన్స్‌లు మాత్రం పెద్దగా రాలేదు. అందం, అభినయం, ఆసక్తి మూడూ ఉన్నాయి కనుక -తెలుగు అవకాశాల కోసమే ఎదురు చూస్తూ కూర్చోలేదు. నటించడానికి ఏ భాషైతే ఏం అనుకుంది. కోలీవుడ్, మాలీవుడ్‌లో గట్టిగానే ప్రయత్నించింది. సరైన అవకాశాల కోసం చూస్తూ -గ్యాప్‌లేకుండా సినిమాలు చేస్తున్న తెలుగు బ్యూటీకి మంచి రోజులు వచ్చినట్టే కనిపిస్తోంది. ఈమధ్యే దుల్కర్ సల్మాన్‌తో చేసిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాకు హిట్టుటాక్ పడింది. తెలుగులోనూ సినిమా సక్సెస్ కొట్టడంతో -రీతూ ఫేట్ మారినట్టే కనిపిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న పెద్ద ప్రాజెక్టులో రీతూకి చోటు దొరికిందని అంటున్నారు. తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్‌తో దర్శకుడు శశి తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్టులో -హీరోతోపాటు చెఫ్‌గా వైవిధ్యమైన పాత్రలో రీతూ కనిపించనుందట. నిత్యమీనన్ మరో హీరోయిన్. ప్రస్తుతం లండన్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం వర్కౌటైతే -సౌత్ హీరోయిన్‌గా రీతు బిజీ కావడం ఖాయమంటున్నారు.