బ్రేక్ తెచ్చే పెన్సిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పెన్సిల్’ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని, ఈ చిత్రంతో హీరోగా తెలుగు లో గుర్తింపు వస్తుందని అనుకుంటున్నానని హీరో జి.వి.ప్రకాష్ తెలిపారు. సంగీత దర్శకుడిగా పలు చిత్రాలకు అందరూ మెచ్చే బాణీలను అందించిన జి.వి.ప్రకాష్ కథానాయకుడిగా రూపొందిన ‘పెన్సిల్’ చిత్రం విడుదల సందర్భంగా ఆయన పలు విషయాలను తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఇటీవల విడుదల ఆడియోకు మంచి స్పందన లభించిందని, అన్ని పాటలు ప్రేక్షకులకు నచ్చుతున్నాయని, ముఖ్యంగా ‘రెండే కళ్లు’ అనే పాట తనకు నచ్చిందని అన్నారు. ఈ సినిమాలో చిన్నతనంలో పాఠశాలలకు వెళ్లిన మధురస్మృతులు మీ ముందుకు వస్తాయని, వీటితోపాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుందని అన్నారు. శ్రీదివ్య కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వి.టి.వి.గణేష్, ఊర్వశి, టి.పి.గజేంద్రన్, అభిషేక్ శంకర్, ప్రియాఘోష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.