హారర్ నేపథ్యంలో దమ్ముంటే రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామకృష్ణ, బింధు బార్బి జంటగా హార్డ్‌వర్క్ ప్రొడక్షన్స్ పతాకంపై షెరాజ్ దర్శకత్వంలో రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం ‘దమ్ముంటే రా’. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా దర్శకుడు షెరాజ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు వచ్చిన హర్రర్ చిత్రాలకు భిన్నంగా సరికొత్త కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, కేవలం 24 రోజుల్లోనే పూర్తిచేశామని అన్నారు. ‘పార్సిల్’ చిత్రంతో హీరోగా పరిచయమైన తాను ఈ సినిమాతో దర్శకుడిగా మారానని, నేటి యువత మనోభావాలకు అద్దంపడుతూ సాగే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. ఈనెలాఖరులో పాటలను విడుదల చేసి జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.