మళ్లీ మళ్లీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాశి అంటే అందరికీ ఇష్టమే. ముగ్ధమోహన రూపంతో కెరీర్ ప్రారంభించిన తొలినాళ్ళల్లో అందరినీ ఆకట్టుకునే నటనతో, అందంతో మంచి మార్కులను కొట్టేసింది. ఆ తరువాత అనేక చిత్రాల్లో తన సత్తాను చూపింది. రాశి వుంటే చాలు సిన్మా హిట్ అన్న రేంజ్‌కి చేరింది. ఆ తరువాత అనుకోకుండా శరీరం సహకరించకపోవడంతో హీరోయిన్ల రేస్‌లోనుండి తప్పుకుంది. పెళ్లిచేసుకుని వెళ్లిపోయింది. ఆమధ్య ఒకటి రెండు చిత్రాల్లో ఎగ్‌స్ట్రాగా కనిపించినా లాభం లేకపోయింది. ఇపుడు మళ్లీ 12 ఏళ్ళ తరువాత నటించడానికి సిద్ధమైంది. అయితే ఈసారి హీరోయిన్‌గా కాదు హీరోయిన్ తల్లిగా నటిస్తోంది. ఇపుడు నటిస్తున్నా కెమెరా ముందు కొత్తగా ఏం లేదని, ఇప్పటి హీరోయిన్లు గ్లామర్‌కే పరిమితమై ఏదో చేశాం అన్నట్లు నటిస్తున్నారని చెబుతోంది. తాను గ్లామర్‌తోపాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించానని, ఇపుడు హీరోయిన్లు అలా ఆ దారిలో వెళితే విజయాలు అందుకోవచ్చని టిప్స్ చెబుతోంది.!