అదిరేటి డ్రెస్సు నీవేస్తే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్రతో దూసుకువెళుతున్న బాలీవుడ్ భామ సోనమ్‌కపూర్ కేన్స్ చిత్రోత్సవంలో రెడ్‌కార్పెట్‌పై వినూత్నమైన దుస్తుల్లో కన్పించి ఆహూతులను ఆకట్టుకున్నారు. మరోవైపు మీడియాతో మాట్లాడినప్పుడు, కేన్స్‌లో జరిగే ఇతర కార్యక్రమాల్లోనూ భిన్నమైన డ్రెస్‌లతో అందరినీ ఆకర్షించారు. ఆదివారం కేన్స్ చేరుకున్న వెంటనే ఆమె ఫొటోషూట్‌కు సిద్ధమయ్యారు. ప్రెస్‌తో మాట్లాడేందుకు ప్రపంచ ప్రఖ్యాత డిజైనర్ రిమ్‌జిమ్ దమ రూపొందించిన నీలిరంగు దుస్తుల్లో మెరిసిపోయిన సోనమ్ సోమవారం రాత్రి ధవళకాంతులీనిన దుస్తుల్లో తళతళలాడారు. ప్రఖ్యాత డిజైనర్ రాల్ఫ్ రుస్సో రూపొందించిన ఈ దుస్తులు ఆహూతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయనే రూపొందించిన నలుపు, నీలిరంగు కలబోతగా ఉన్న దుస్తులతో కేన్స్ ‘వైల్డ్’ పార్టీకి హాజరైన సోనమ్ అక్కడివారనీ తన అందంతో మత్తెక్కించారు. కాగా సోమవారం ఆమె ధరించిన రాల్ఫ్‌రుస్సో డిజైన్ దుస్తులపై సోషల్‌మీడియాలో విస్తృత చర్చ జరిగింది. ఆ దుస్తుల్లో ఆమె శే్వతమయూరంలా కన్పించిందని కొందరు వ్యాఖ్యలు చేస్తే, మరికొందరు రెడ్‌కార్పెట్‌పై ఆమె పాదాలు కన్పించకుండా రెడ్‌కార్పెట్‌పై వృత్తాకారంలో పరుచుకున్న దుస్తులు రుమాలీరోటీలా ఉన్నాయని వ్యంగోక్తి విసిరారు. మహాత్మాగాంధీ అంగవస్త్రం మాత్రమే ధరించి నూలు వడుకుతున్న ఫొటోను సోనమ్ తాజా డ్రెస్‌తో ఉన్న ఫొటో జతచేసి మరికొందరు వస్త్రాన్ని దుర్వినియోగం చేసిందంటూ కొందరు తప్పుపడితే, ఈమె ఇలా చేయడంవల్ల ఇళ్లలోకి అవసరమైన మెటిరీయల్ కొరత ఏర్పడిందని చెణుకులు విసిరారు. ఏదైతేనేం..ఆమె వేసిన అదిరేటి డ్రెస్సు...మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది.

chitram కేన్స్‌లో సోనమ్