మహేష్‌బాబే నా బలం.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన కథలతో చిత్రాలను రూపొందిస్తూ, ముఖ్యంగా మానవ సంబంధాల ఇతివృత్తంతో సినిమాలు తీయడంలో నేర్పరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఆయన తాజాగా రూపొందిన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పి.వి.వి బ్యానర్ పతాకంపై పరం వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సమంత, కాజల్, ప్రణీతలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈనెల 20న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో ఇంటర్వ్యూ..

* మహేష్‌తో రెండవ సినిమా చేస్తున్నారు?
- ఆయనతో రెండోసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఆయనెప్పుడూ టాప్‌లోనే ఉంటాడు. ఒక సెన్సిటివ్ కథను అర్థం చేసుకుని నాకు మరో అవకాశం ఇవ్వడం గొప్ప విషయం. ఆయన నటుడికంటే కూడా ముందు మంచి మనసున్న మనిషి. ఆయన దర్శకుల హీరో.
* ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు
ఒకేదారిలో ఉన్నట్టున్నాయి?
- రెండూ వేరు వేరు కథలు. సీతమ్మ వాకిట్లో.. ఇద్దరు అన్నదమ్ములమధ్య మధ్య తరగతి కుటుంబంలో నడిచే కథ అది. ‘బ్రహ్మోత్సవం’ పూర్తి డిఫరెంట్‌గా వుంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన కథ. నాలుగైదు కుటుంబాలు కలిసి ఉమ్మడిగా ఉన్న కథతో తెరకెక్కించాం.
* నేపథ్యం, యాసల గురించి?
- ఇందులో విజయవాడ నేపథ్యంలో కథ సాగుతుంది. యాసల గురించి ప్రత్యేకంగా ఏముండదు.
* మీ సినిమాల్లో నటీనటులు చాలామంది వుంటారు, కారణం?
- బేసిగ్గా నాకు మనుషులంటే ఇష్టం. సమకాలీన ప్రపంచంలో మనం అనుకున్నది జరుగుతుందా లేదా, మన పనులు మనం సక్రమంగా చేసుకుంటున్నామా లేదా అనే ఆలోచనలతో మనలో ప్రశాంతత కరువవుతోంది. ఆ ప్రశాంతత రావాలంటే మనం అనుకున్న మనుషుల దగ్గర మనం వుంటేనే అది దొరుకుతుంది. ఇలాంటిది కుటుంబ సభ్యులమధ్యే వుంటుందని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా.
* ఈ సినిమా కోసం బాగా టెన్షన్ పడ్డారని విన్నాం?
- ఏ సినిమా చేసినా ప్రెషర్ అనేది వుంటుంది. అయితే ఈ సినిమాకు ఇంకాస్త ఎక్కు ప్రెషర్ ఎక్కువైంది. దానికి కారణం, ఈ సినిమాలో 25మందికిపైగా ప్రముఖ నటీనటులు ఉన్నారు. వారందరినీ కలుపుకుని షూటింగ్ చేసే విషయంలో టెన్షన్ తప్పదు. అలాగే, మహేష్ కూడా నాకు చాలా సపోర్టు అందించాడు. ఎలాంటి ఎగుడుదిగుడులున్నా ఎదుర్కోగలననే నమ్మకాన్ని ఆయనే ఇచ్చారు. నిజంగా మహేషే నా బలం.
* ‘సీతమ్మ వాకిట్లో..’ సినిమా కోసం ప్రముఖ
సీనియర్ రచయితతో పని చేయించారు కదా? మరి ఈ సినిమా కోసం ఎవరిని సంప్రదించారు?
-‘సీతమ్మ వాకిట్లో..’ సినిమా సమయంలో నా స్థాయికంటే ఎక్కువగా డీల్ చేయాల్సిన కథ కావడంతో గణేష్‌పాత్రోగారి సహాయం తీసుకున్నాను. ఆయన అనుభవం నాకు ఉపయోగపడింది. ఆ తరువాత ‘ముకుంద’, ‘బ్రహ్మోత్సవం’ సినిమాలు చేస్తున్నానని ఆయనకు చెప్పాను. ఈ కథ విని మూడు పేజీల స్క్రీన్‌ప్లే రాసిచ్చారు. ఆయన ఇప్పుడు లేకపోవడం బాధాకరం. ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు ఓంకారం చేసింది ఆయనే.
* బ్రహ్మోత్సవం టైటిల్ గురించి?
- ఇది ఖచ్చితంగా చెప్పాలి. నలుగురు కలిసి పండగలా చేసుకునేదే ఉత్సవం. దానికి పీక్ ఏదైనా ఉందంటే అది బ్రహ్మోత్సవం. దేవుడికి మాత్రమే చేస్తారు. అంటే, నలుగురు కాదు, చాలామంది కలిసి చేసుకునే సంబరమే బ్రహ్మోత్సవం. కాబట్టి ఈ టైటిల్ పెట్టాం.
* మరి ఈ సినిమాలో మహేష్‌బాబు పేరేంటి?
- సీతమ్మ వాకిట్లో.. చిన్నోడుగా మాత్రమే అందరూ పిలుస్తారు. నేను కథలు రాసుకున్నప్పుడు ఎందుకో పేర్లు రాసుకోను. హీరోలు కూడా కథ విని పేరేంటి అని అడుగుతుంటారు.
* ఫస్ట్‌లుక్‌లో మహేష్ చెప్పులు తొడిగే పోస్టర్ కాంట్రవర్సీ అయ్యింది గదా?
- తండ్రి పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని చాటుకునే సన్నివేశం అది. దానికోసం ఇలా డిజైన్ చేశాం. మనలో చాలామంది ఫంక్షన్‌లలో ఇలాంటివి చేయాలంటే ఆలోచిస్తుంటారు. అందులో కాంట్రవర్సీ ఏమీ లేదు. తండ్రికి చెప్పులు తొడగడం గొప్ప విషయమే గదా!
* ఇకమీదట మీరు ఇలాంటి సినిమాలే చేస్తారా?
- ఒకరకమైన చిత్రాలు చేయాలంటే మనకే కాదు ప్రేక్షకులకూ బోర్ కొడుతుంది. సమయాన్ని బట్టి మారుతూండాలి. ఇప్పటికే చాలా కథలు రాసుకున్నాను. తరువాతి చిత్రం ఎలాంటి జోనర్‌లో వుంటుందో చెప్పలేం.
* టెక్నికల్ హైలెట్స్ గురించి?
- ఈ సినిమాలో మిక్కి అందించిన పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. అలాగే గోపీసుందర్ రీరికార్డింగ్ కూడా అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి సెట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఆయనతో పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. అలాగే, రత్నవేలు ఫొటోగ్రఫి హైలెట్‌గా నిలుస్తుంది.
* తదుపరి చిత్రాలు
- ప్రస్తుతానికి కథలైతే ఉన్నాయి. ఈ సినిమా తరువాతే వాటి గురించి ఆలోచిస్తా. -శ్రీ

పిక్నిక్‌లో
బ్రహ్మోత్సవం

‘బ్రహ్మోత్సవం’ చిత్రానికి సంబంధించిన తాజా ట్రైలర్ బుధవారం విడుదలైంది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో.. కుటుంబ సభ్యులందరూ కలసి పిక్నిక్‌కు వెళ్లిన సన్నివేశాలున్న ఈ టీజర్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది.