శ్రీశ్రీ వస్తున్నాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకంపై ముప్పలనేని శివ దర్శకత్వంలో రూపొందించిన శ్రీశ్రీ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలను దర్శకుడు ముప్పలనేని శివ వివరిస్తూ, ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, సినిమాలో మహేష్‌బాబు వాయిస్‌ఓవర్ హైలెట్‌గా నిలువనుందని తెలిపారు. కృష్ణ కెరీర్‌లో సినీ స్వర్ణోత్సవ సినిమాగా శ్రీశ్రీ రూపొందించామని, ఓ అర్థవంతమైన సినిమా అందరికీ నచ్చేలా రూపొందించామని అన్నారు. పోలీస్ అధికారిగా సుధీర్‌బాబు నటన హైలెట్‌గా వుంటుందని, త్వరలో అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నరేష్, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ఎల్.బి.శ్రీరాం, తోటపల్లి మధు, దేవదాస్ కనకాల, మురళీశర్మ, కునాల్ కౌశిక్, అనితాచౌదరి, సోఫియా తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సతీష్ ముత్యాల, మాటలు:రాం కంకిపాటి, సంగీతం: ఇ.ఎస్.మూర్తి, ఎడిటింగ్:రమేష్, నిర్మాతలు: సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ముప్పలనేని శివ.