జూలైలో ఎన్టీఆర్ కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ ఫస్ట్‌లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేయనున్నారు. ఇది ఎన్టీఆర్ నటించే 26వ చిత్రం. నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 27వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ తదుపరి చిత్రం ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై వుంటుందని తెలిసింది. రచయితగా పలు చిత్రాలను రూపొందించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం వుంటుందని తెలిసింది. మరోవైపు పూరి జగన్నాధ్‌తో కూడా ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్. ‘జనతాగ్యారేజ్’ తరువాత వక్కంతం వంశీని దర్శకుడిగా మారుస్తూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలిసింది.