అ ఆ సెన్సార్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా నటించిన చిత్రం ‘అ ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- అనసూయా రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 2న విడుదలకు సిద్ధం చేశామని అన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ అ ఆలో అందమైన ప్రేమకథతోపాటు అన్ని రకాల భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన ఆడియోకి మంచి స్పందన లభించిందని, మిక్కీ జె మేయర్ అందించిన సంగీతంలో ప్రతిపాటా హిట్ అయిందని, రామజోగయ్య శాస్ర్తీ, కృష్ణచైతన్యల సాహిత్యానికి చిత్ర, కార్తీక్, శ్రావణభార్గవి, అంజనా సౌమ్య, రమ్య, సాయి శివాని, రాహుల్ నంబియార్, అభయ్ జోధ్‌పూర్‌కర్ ఆలపించారని ఆయన తెలిపారు. అనుపమా పరమేశ్వరన్ మరో కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నదియా, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస్‌రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా:నటరాజ్ సుబ్రమణియన్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం:మిక్కీ జె మేయర్, నిర్మాత:రాధాకృష్ణ సూర్యదేవర (చినబాబు), కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:త్రివిక్రమ్.