6న బాబు బంగారం పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భలే భలే భలే మగాడివోయ్’ హిట్‌తో దర్శకుడిగా స్టార్ స్టేటస్ కొట్టేసిన మారుతి, ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో ‘బాబు బంగారం’ పేరుతో ఓ కామెడీ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. వెంకీ స్టైల్లో సరదాగా సాగే ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఫస్ట్‌లుక్‌కి అంతటా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఆ రెస్పాన్స్‌తో రెట్టించిన ఉత్సాహం తెచ్చుకుని ‘బాబు బంగారం’ టీమ్ జూలై 1న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా ప్రయత్నాలు చేస్తోంది. అదేవిధంగా జూన్ 2న టీజర్‌ను విడుదల చేస్తారట. ఇక జూన్ 6న గిబ్రాన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియో విడుదలయ్యే అవకాశం వుంది. వెంకీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను సితార క్రియేషన్స్‌తో కలిసి సురేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.