వినోదం గ్యారంటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయ్‌భరత్, అశ్విని జంటగా ఎస్.ఎస్. సెల్యూలాయిడ్స్ పతాకంపై జైశ్రీరామ్ దర్శకత్వంలో పొట్నూరు శ్రీనివాసరావు రూపొందించిన వినోదం 100శాతం అన్నీ నవ్వులతోనే నిండి వుందని దర్శకుడు దాసరి నారాయణరావు వ్యాఖ్యానించారు. ఈరోజు చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రస్తుతం పరిశ్రమలో చిన్న సినిమాలను థియేటర్ వద్దకు తీసికెళ్లి ప్రోత్సహించాలన్న నిర్ణయంతో తాను ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. దర్శకుడు తనవద్ద పనిచేశాడని, సినిమాను అందరికీ నచ్చేలా తీర్చిదిద్ది వుంటాడన్న నమ్మకం వుందని ఆయన తెలిపారు.
ఈ సినిమాను తాను చూశానని, ఖచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లలో విరగబడి నవ్వుతారన్న నమ్మకం వుందని రాందాస్ అన్నారు. ఈ సినిమాను కొంత విదేశాల్లో చిత్రీకరించామని, ప్రతి నటుడు తమ సినిమాగా భావించి నటించారని నిర్మాత శ్రీనివాసరావు అన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో రాందాసు ఈ సినిమాను విడుదలచేస్తున్నారని, ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం అమెరికాలో కూడా విడుదల చేశామని దర్శకుడు జైశ్రీరామ్ తెలిపారు. కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొని విశేషాలను తెలిపారు. సత్యం రాజేష్, సంపూర్ణేష్ బాబు, పృధ్వీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:సుభాష్ ఆనంద్, కెమెరా:మల్లికార్జున్, మాటలు:అంజన్, పాటలు:చిర్రావూరి విజయకుమార్, కృష్ణచిన్ని, చంద్ర కాటుబోయిన, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:పోట్నూరు శ్రీనివాసరావు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:జైశ్రీరామ్.