ఇద్దరు కథానాయికలతో రోగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూరిజగన్నాథ్ ప్రస్తుతం రూపొందిస్తున్న లోఫర్ షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్‌తేజ్ హీరోగా రూపొందిన ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకానుంది. ఈలోగానే పూరీ మరో ప్రాజెక్టు సిద్ధం చేసేస్తున్నాడు. కన్నడ, తెలుగు భాషలలో రోగ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. కొత్త హీరో ఇషాన్‌ను పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట! ఇప్పటికే అమైరా దస్తూర్‌ను హీయిన్‌గా ఎంపిక చేసారు. మరో హీరోయిన్‌గా ఎంజెల్ల క్రిస్లిమ్ నటిస్తుంది. పూరి మార్క్ స్టైల్‌లో ఉండే సినిమా వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. హీరోయిన్లను ఎంత అందంగా చూపించాలో పూరీకి బాగా తెలుసుకునుక -రోగ్‌తో ఆడియన్స్‌కు ఫుల్ ఫీస్ట్ అందబోతుందన్న మాట.