జూన్‌లో రెండక్షరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ కంచెమ్మ తల్లి సినీ ప్రొడక్షన్స్ పతాకంపై లోకేష్‌రెడ్డి, అక్షర జంటగా ఎం.శ్రీనివాసరావు దర్శకత్వంలో పైలా దేవదాస్‌రెడ్డి రూపొందించిన ‘రెండక్షరాలు’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ మొదటివారంలో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత దేవదాస్‌రెడ్డి మాట్లాడుతూ, సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ప్రేమికులు పెద్దల ఆశీస్సులతో పెళ్లిచేసుకుంటే అవి నిలబడతాయని, లేకుంటే ఆ ప్రేమికులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలన్న అంశానికి ఎంటర్‌టైన్‌మెంట్ జోడించి ఈ సినిమా రూపొందించామని తెలిపారు. సినిమా అంతా పక్కా ప్లాన్‌తో శ్రీకాకుళం జిల్లాలో షూటింగ్ చేశామని, జూన్ మొదటివారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నామన్నారు. అనుకున్న సమయంలోనే సినిమా పూర్తిచేశామని, ఇప్పటి యువతకు ఈ సినిమా తప్పక నచ్చుతుందని దర్శకుడు శ్రీనివాసరావు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:ఇ.ప్రసాద్, ఎడిటింగ్:నందమూరి హరి, నిర్మాత:పైలా దేవదాస్ రెడ్డి, దర్శకత్వం:ఎం.శ్రీనివాసరావు.