మెగా ఛాన్స్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వెనె్నల’ సినిమా ద్వారా సినీరంగ ప్రవేశంచేసిన కిశోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. తరువాత ఎన్నో సినిమాలలో కిశోర్ తన పాత్రల ద్వారా ప్రేక్షకులను నవ్వించాడు. ఇప్పుడు ఓ అరుదైన అవకాశం వెనె్నల కిశోర్‌కి చిక్కింది. అదేమిటంటే- మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఫిలిం అయిన ‘కత్తిలాంటోడు’ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు పనిచేయబోతున్న సాంకేతిక నిపుణులు, నటీనటుల ఎంపిక కూడా పూర్తయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాలో ఓ కీలకపాత్ర కోసం మొదట సునీల్‌ని అనుకున్న చిత్ర బృందం, ఇప్పుడు ఆ స్థానంలో కమెడియన్ వెనె్నల కిశోర్‌ని తీసుకున్నట్లు సమాచారం. నిజానికి సునీల్ ఈ సినిమాలో చేయడానికి తన అంగీకారం తెలిపినా ఈ సినిమా కోసం దాదాపు 40 రోజులు డేట్స్ కేటాయించవలసి ఉండడంతో కుదరక తప్పుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆ పాత్రని వెనె్నల కిశోర్‌తో చేయిస్తున్నారని తెలిసింది. లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు వెలువడే అవకాశం వుంది.