అసలు హీరో త్రివిక్రమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- నితిన్
‘త్రివిక్రమ్‌గారితో కలిసి వర్క్ చేయాలనేది నా కల. ఆయన దగ్గరనుండి ఫోన్ వచ్చినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం ఆయనైతే, మరొక కారణం కథ’ అని అంటున్నాడు యువ హీరో నితిన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన చిత్రం ‘అ ఆ’ అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా హీరో నితిన్‌తో ఇంటర్వ్యూ...
ఇంతకి అ.. ఆ అని పేరు పెట్టారు ఎందుకు?
-‘అ ఆ’ ప్రోపర్ లవ్‌స్టోరీ ప్రేమకథకు ఫ్యామిలీతో లింక్ చేసే విధానం బావుంటుంది. లవ్‌స్టోరీ మాత్రమే కాకుండా హ్యూమన్ వాల్యూస్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో వుంటాయి. నేనొక చెఫ్ పాత్రలో కనిపిస్తాను. బాధ్యతగల కొడుకుగా, చెల్లెల్ని ప్రేమించే అన్నయ్యగా కొత్తగా కనిపిస్తాను. అందరికీ కనెక్ట్ అయ్యే పాయింటే.
ఈ అవకాశం ఎలా వచ్చింది?
-నేను చేసిన ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమా తరువాత ‘హార్ట్‌ఎటాక్’ సినిమా షూటింగ్‌కోసం నేను స్పెయిన్ వెళ్లాను. ఆ సమయంలో ఈ సినిమాలో నటించమని ఫోన్‌చేసి అడిగారు. చాలా సంతోషపడ్డాను. అంతా ఓకె అయిపోతుందనుకున్న సమయంలో సడెన్‌గా ఆగిపోయింది. కొంచెం బాధపడ్డాను. కానీ సంవత్సరం తరువాత మళ్లీ కాల్ చేసి అడిగారు. కరెక్ట్ టైంలో మంచి సినిమా పడింది.
త్రివిక్రమ్‌తో పనిచేయడం ఎలా వుంది?
- త్రివిక్రమ్‌గారితో కలిసి వర్క్ చేయాలనేది నా కల. ఆయన దగ్గరనుండి ఫోన్ వచ్చినపుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఒక కారణం ఆయనైతే, మరొక కారణం కథ. నేను నటించిన 22 సినిమాలకు ఈ సినిమాకు ఖచ్చితంగా ఛేంజ్ ఉంటుంది. ప్రతిరోజు కథ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. ఇది దర్శకుడి సినిమా అని చెప్పొచ్చు. సినిమా మొదలయినప్పటినుండి కొత్తగా ఉండాలని త్రివిక్రమ్ పరితపించేవారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుతుంది. సినిమాకు నిజమైన హీరో ఆయనే. ఈ సినిమాతో త్రివిక్రమ్ నాకుమధ్య మంచి ర్యాపో కుదిరింది. పెర్సనల్‌గా ఆయనొక జ్ఞాని. ఆయనకు తెలియని విషయమంటూ ఉండదు. నాకు ఎలాంటి సమస్య వచ్చినా మొదట ఆయనకే ఫోన్ చేస్తాను.
మీ కెరీర్‌లో ఫ్లాప్‌లే ఎక్కువగా ఉన్నాయి కదా.. అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు?
- 2002లో నా కెరీర్ మొదలుపెట్టాను. 14 సంవత్సరాల్లో 22 సినిమాలు చేశా. కాని నాలుగు సంవత్సరాలనుండి నాకు హిట్స్ వచ్చాయి. 2011 వరకు సుమారుగా అన్ని ఫ్లాప్సే. ఆ సమయంలో నేను చాలా నేర్చుకున్నాను. మాస్ సినిమాలు నాకు సెట్ కావట్లేదని, నా బాడీ లాంగ్వేజ్‌కు తగ్గట్లుగా లవ్ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే ‘ఇష్క్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాను. కాని ఏ రోజూ నేను క్రుంగిపోలేదు. పెర్సనల్‌గా నేను చాలా స్ట్రాంగ్‌గా ఉంటాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాను.
మీ సినిమా సెట్స్‌కు పవన్ వచ్చారు కదా?
- ఈ సినిమా సెట్స్‌కు పవన్ కళ్యాణ్ వచ్చారు. నిజానికి ఆయన వస్తున్నారని ఎవరికీ తెలియదు. అప్పుడే సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆయన ముందు నటించడానికి చాలా టెన్షన్ పడ్డాను కానీ బాగానే చేశానని అనుకుంటున్నాను.
నిర్మాతగా కూడా సినిమా చేశారు కదా.. ఆ అనుభవం ఎలా వుంది?
- ‘అఖిల్’ సినిమా పరాజయం నన్ను చాలా బాధపెట్టింది. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. కానీ మేము అనుకున్న రిజల్ట్ మాత్రం రాలేదు. దాంతో ఓ నాలుగైదు రోజులు నాకు నిద్ర కూడా పట్టలేదు.
ఇక ముందు కూడా నిర్మాతగా సినిమాలు చేస్తారా?
- మా ప్రొడక్షన్‌లో సినిమాలు నిర్మిస్తూనే వుంటాం. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాకు సీక్వెల్ చేయాలనుకుంటున్నాం. ఫస్ట్ హాప్ స్టోరీ కూడా రెడీ అయింది. సెకండ్ హాఫ్ కూడా బాగా వస్తేనే చేస్తాను. లేదంటే చేయను.
మీరు పెద్ద దర్శకులతో కూడా పనిచేశారు కదా?
- అవును. నేను చాలామంది దర్శకులతో పనిచేశాను. ఎవరి స్టైల్ వారికి వుంటుంది. త్రివిక్రమ్‌గారు నన్ను చదివేశారు. నా బాడీ లాంగ్వేజ్, మాట తీరు, హెయిర్ స్టైల్- ఇలా ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకునేవారు. రాజవౌళిగారి తరువాత నా మీద అంత కేర్ తీసుకొని సినిమా చేసింది త్రివిక్రమ్‌గారే.
మరి పెళ్లి ఎప్పుడు?
- ఇంట్లో పెళ్లి చేసుకోమని రెండు సంవత్సరాలుగా అడుగుతున్నారు. నేనేమో నెక్ట్స్ ఇయర్ చేసుకుంటా అని దాటేస్తూ వస్తున్నాను. వీలైనంతవరకు పెళ్లి వాయిదా వేస్తూనే వుంటాను.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్?
- ఇప్పటివరకూ ఏది ఓకె చేయలేదు. మరొకవారంలో కొత్త ప్రాజెక్టు వుంటుంది.

-శ్రీ