రైట్ రైట్‌కు క్లీన్ యు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుమంత్ అశ్విన్, ప్రభాకర్ ప్రధాన తారాగణంగా మనూ దర్శకత్వంలో జె.వంశీకృష్ణ రూపొందించిన ‘రైట్ రైట్’ చిత్రానికి సెన్సార్ నుండి క్లీన్ యు సర్ట్ఫికెట్ లభించింది. ఈ చిత్రాన్ని జూన్ 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత జె.వంశీకృష్ణ మాట్లాడుతూ, ఓ బస్సు నేపథ్యంలో సాగే చిత్రంగా ఈ సినిమా రూపొందిందని, అనుకోకుండా బస్‌కండక్టర్ అయిన ఓ కుర్రాడికి ఓ అమ్మాయి తారసపడితే వారిద్దరికి ఏ విధమైన అనుబంధం ఏర్పడింది అన్న కథనంతో కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగేలా ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ఎక్కువ ప్రింట్లతో ఈ సినిమాను విడుదల చేయనున్నామని, ప్రభాకర్ పాత్ర హైలెట్‌గా వుంటుందని, అన్నివర్గాలవారు చూడదగ్గ సినిమా అని ఆయన తెలిపారు. పూజా జవేరి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తా.రమేష్, జీవా, రాజా రవీందర్, భరత్‌రెడ్డి, వినోద్, పావని, కరుణ, జయవాణి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంగీతం: జె.బి., పాటలు: శ్రీమణి, కెమెరా:శేఖర్ వి.జోసెఫ్, మాటలు:డార్లింగ్ స్వామి, నిర్మాత:జె.వంశీకృష్ణ, దర్శకత్వం:మనూ.