హీరోయిన్ వేటలో బాలకృష్ణ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి బాలకృష్ణ వందో చిత్రంగా తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రం ఇటీవల తన తొలి షెడ్యూల్‌లో దాదాపు నలభై రోజులపాటు మొరాకోలో భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్‌కు సమాయత్తం అవుతున్నది. ఇప్పుడు ఈ సినిమా చిత్ర బృందాన్ని ఓ సమస్య వేధిస్తున్నది. అదేమిటంటే.. ఈ సినిమా హీరోయిన్ విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా నయనతారను తీసుకోవాలని భావించినా ఆమె డేట్స్ కుదరకపోవడంతో ప్రస్తుతం హీరోయిన్‌ని వెదికే పనిలో పడ్డారు. మరో వారం రోజుల్లో హీరోయిన్‌ని ఎంపిక చేసి రెండో షెడ్యూల్‌ని ప్రారంభించాలని దర్శకుడు భావిస్తున్నట్టు సమాచారం. దర్శకుడు స్వంత బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేం వి.యస్.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల చేస్తున్నట్టు సమాచారం.