భావోద్వేగాలతో నేను సీతాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సందీప్, భవ్యశ్రీ, రణధీర్, కోమలి ప్రధాన తారాగణంగా సందీప్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మల్లం దర్శకత్వంలో చిటుకుల సందీప్ రూపొందించిన చిత్రం ‘నేను సీతాదేవి’. ఈ చిత్రానికి సంబంధించిన ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తిచేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ, భావోద్వేగాల సమాహారంగా పాత్రలమధ్య సంక్లిష్టతతో చిత్రం సాగుతుందని, ఓ అందమైన కథకు అద్భుతమైన కథనం చేర్చి ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా రూపొందించామని తెలిపారు. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి ఆదరణ లభించిందని, దర్శకుడు శ్రీనివాస్ మల్లం టేకింగ్ ప్రేక్షకులను మెప్పిస్తుందని తెలిపారు. తనకు, రణధీర్‌కు వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా వుంటాయని, త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. జీవా, వెనె్నలకిశోర్, గుండు హనుమంతరావు, చిత్రం శ్రీను, ధన్‌రాజ్, అంబటి శ్రీను, విశ్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:చైతన్య రాజా, నిర్మాత:చిటుకుల సందీప్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:శ్రీనివాస్ మల్లం.