శ్రీశ్రీ...మరో ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా ముప్పలనేని శివ దర్శకత్వంలో సాయిదీప్ చాట్ల, వై.బాలురెడ్డి, షేక్ సిరాజ్ రూపొందించిన చిత్రం శ్రీశ్రీ. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్ 3న విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కృష్ణ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమలో కొత్త కొత్త సాంకేతిక విలువలను తన చిత్రాల ద్వారానే పరిచయం చేశామని, అదేవిధంగా శ్రీశ్రీ సినిమాతో మరో ప్రయోగం చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రాన్ని తొలిసారిగా విదేశాలలో ఆన్‌లైన్ ద్వారా నేరుగా విడుదల చేస్తున్నామని, ప్రపంచంలో వున్న తెలుగువారందరూ ఈ సినిమాను ఇంట్లోనే కూర్చుని కుటుంబ సమేతంగా చూడవచ్చని ఆయన తెలిపారు. భావోద్వేగాలకు నాటకీయతను మేళవించి ఈ సినిమాను దర్శకుడు చక్కగా రూపొందించారని, తమ జీవితాలకు దగ్గరగా ఈ సినిమా వుంటుందని నటి విజయనిర్మల తెలిపారు. కార్యక్రమంలో ముప్పలనేని శివ, నిర్మాతలు సాయిదీప్, బాలురెడ్డి పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.