ప్రముఖ రచయిత సత్యమూర్తి ఇకలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ తెలుగు సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ తండ్రి జి.సత్యమూర్తి ఇకలేరు. సోమవారం చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 61 సంవత్సరాలు. దాదాపు 90 సినిమాలకు రచయితగా పనిచేసి స్టార్ రైటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన రచయితగా చేసిన అనేక చిత్రాలు సంచలన విజయాలు సాధించాయి. ముఖ్యంగా చిరంజీవి చేసిన చాలా చిత్రాలకు ఆయన రచయితగా పనిచేశారు.‘ఖైదీ నెంబర్ 786’,‘అభిలాష’,‘పోలీస్ లాకప్’, ‘్ఛలెంజ్’,‘బంగారు బుల్లోడు’, ‘నారీ నారీ నడుమ మురారి’,‘శ్రీనివాస కళ్యాణం’ వంటి చిత్రాలకు ఆయనే రచయిత. 1982లో రూపొందిన ‘దేవత’ చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించిన సత్యమూర్తి రచయితగా ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తరువాత కథా రచయితగా మారి పలు సినిమాలకు ప్రాణంపోశారు. ఆయన తనయుడు దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం క్రేజీ సంగీత దర్శకుడిగా వెలుగొందుతున్నాడు. సత్యమూర్తికి తెలుగుతోపాటు తమిళ సినిమా పరిశ్రమతో చాలా అనుబంధం వుంది. కాగా ప్రజల సందర్శనార్ధం మంగళవారం మధ్యాహ్నం వరకు ఆయన స్వగృహంలో భౌతికకాయాన్ని ఉంచుతారు. సాయంత్రం అంత్య క్రియలు జరగనున్నాయ.
ప్రముఖుల సంతాపం
సత్యమూర్తి మృతిపట్ల తెలుగుచిత్రసీమకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, ఆయన రచయితగా పనిచేసిన ‘బంగారుబుల్లోడు’, ‘్భలేదొంగ’ సినిమాలతో తనతో మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని, అలాంటి మంచి రచయితను కోల్పోడం సినీ పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సత్యమూర్తి ప్రతిభను కొనియాడిన దర్శకుడు దాసరి నారాయణరావు ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.