భయపెట్టే దొర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యరాజ్, శిబిరాజ్, బిందుమాధవి ప్రధాన తారాగణంగా రత్న సెల్యులాయిడ్స్ పతాకంపై నిర్మాత జక్కం జవహర్‌బాబు అందిస్తున్న చిత్రం ‘దొర’. తమిళంలో ధరణీధరన్ దర్శకత్వం వహించిన జాక్‌సన్ దురై పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించారు. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాత జవహర్‌బాబు మాట్లాడుతూ, తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, పిరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను జూన్ మొదటివారంలో, సినిమాను మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. తమిళంలో విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభిస్తోందని, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త జోనర్‌లో పరిచయం అవుతోందని ఆయన తెలిపారు. కరుణాకరన్, సహాయం, రాజేంద్రన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: యువరాజ్, సంగీతం: సిద్ధార్థ్ విపిన్, నేపథ్య సంగీతం: చిన్న, పాటలు: వెనె్నలకంటి, చంద్రబోస్, మాటలు: శశాంక్ వెనె్నలకంటి, నిర్మాత: జవహర్‌బాబు జక్కం, దర్శకత్వం: ధరణీ ధరన్.