సరికొత్త పాత్రలో నటిస్తున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘లవ్ యూ అలియా’ చిత్రంలో తాను ఓ సరికొత్త పాత్రలో నటించానని, కెరీర్‌లో ఇలాంటి పాత్ర ఇప్పటివరకూ చేయలేదని నటి భూమిక తెలిపారు. చందన్‌కుమార్, సంగీతా చౌహాన్ జంటగా సమీస్ మ్యాజిక్ సినిమా పతాకంపై ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘లవ్ యూ అలియా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో తన పాత్ర గురించి నటి భూమిక విశేషాలను తెలుపుతూ, తన పాత్రను ఈ సినిమాలో కీలకంగా వుండడం కోసం డిజైన్ చేశారని, ఈ సినిమా విషయంలో తాను కొత్త ఉత్సాహంతో వున్నానని అన్నారు. మెసేజ్‌తోపాటుగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా వున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందని, త్వరలో విడుదలకానుందని తెలిపారు. సుదీప్, సన్నీలియోన్ ప్రత్యేక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో నికిషాపటేల్, రవిచంద్రన్, రవిశంకర్, షాయాజీ షిండే తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం:జెస్సీ గిఫ్ట్, కెమెరా:సంతోష్‌రాయ్ పతాంజె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇంద్రజిత్ లంకేష్.