హాస్యంలో అ..ఆలు దిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నేను ఇప్పటివరకూ సీరియస్, ఇంటెన్స్, రొమాన్స్ లాంటి అన్ని రకాల జోనర్స్ సినిమాలలో నటించాను. కానీ కామెడీ మాత్రం ట్రై చేయలేదు. మొదటిసారి ‘అ ఆ’ చిత్రంలో కామెడీ పాత్రలో నటించే ప్రయత్నం చేశాను. నాకు మొదటినుండి కమెడియన్స్ అంటే చాలా ఇష్టం. కామెడీ పండించడం చాలా కష్టమైన పని. నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చినందుకు థాంక్స్’ అని నటి సమంత పేర్కొన్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ కథానాయకుడిగా హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘అ ఆ’ (అనసూయ రామలింగం, ఆనంద్ విహరి). ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ సమంత చిత్ర విశేషాలను తెలిపారు.
***
నా పాత్ర
ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర నా జీవితానికి దగ్గరగా వుంటుంది. చాలా అల్లరి చేస్తూ త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ వుంటుంది. ఈ వేసవిలో ఇదే నా చివరి చిత్రం. ఇది నా కెరీర్‌కు చాలా ముఖ్యమైనది.
కష్టపడలేదు
కామెడీ జోనర్‌లో నటించడానికి ఎటువంటి కష్టం నేను పడలేదు. త్రివిక్రమ్‌కు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఈ సినిమాలో నేను ఎక్కువగా ఆయననే ఇమిటేట్ చేశాను. ‘అ ఆ’ ఓ కొత్త కానె్సప్ట్ అని చెప్పనుగానీ, సినిమా మొదటినుండీ చివరివరకూ ప్రతి ఒక్కరూ నవ్వుతూనే వుంటారని మాత్రం చెప్పగలను. ఫస్ట్‌కాపీ చూసిన తరువాత మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా వుంది.
త్రివిక్రమ్‌ను చూసి కాదు
ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకుడని ఒప్పుకోలేదు. మొదటినుండీ నేను చేసిన సినిమాలు గమనించి వుంటే అర్థమవుతుంది. కథ నచ్చితేనే తప్ప ఎవరి గురించో నేను సినిమాలు చేయను. మొదట కథ విన్న తరువాత అది నన్ను ప్రోత్సహించేలా వుంటే ఆ సినిమా తప్పక చేస్తాను.
నా పాత్రే కీలకం కాదు
ఈమధ్యకాలంలో హీరోయిన్లకు తక్కువ ప్రాముఖ్యం వున్న సినిమాలే వస్తున్నాయి. పది సినిమాల్లో ఒక్క సినిమాకు మాత్రమే హీరోయిన్‌కు మంచి పాత్ర వుంటుంది. ఇలాంటి నేపథ్యంలో నాకు అ ఆ లాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్‌లిద్దరికీ సమానమైన ప్రాధాన్యత వుంటుంది. ప్రేమకథను మాత్రమే కాక కుటుంబంలోని బంధాలను ఎక్కువగా చూపించే ప్రయత్నాలు చేశారు.
అలా కాదు గానీ..
చేసిన దర్శకులతోనే, హీరోలతోనే మళ్లీ మళ్లీ పనిచేయడంలో నేను కంఫర్ట్‌బుల్‌గా వుంటాను. చాలామంది అదే హీరోలతో అదే దర్శకులతో చేస్తున్నారని విమర్శిస్తున్నమాట నిజమే. కానీ అది నిజం కాదు. త్రివిక్రమ్, నితిన్‌లతో మంచి స్నేహం వుంది. ఈ సినిమాలో ఎలాంటి భేషజాలు లేకుండా నటించాను అంటే వాళ్ళిద్దరితో వున్న స్నేహితమే ప్రధానమైంది.
నితిన్ ఓకె
నితిన్‌తో నటించడం ఎలా వుందంటే, అతను నాకో మంచి ఫ్రెండ్. సినిమా మొదలైన రెండు రోజుల షూటింగ్‌లో మా ఇద్దరిమధ్యా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదు. వీరిద్దర్నీ ఎంపిక చేసుకొని తప్పుచేశానని త్రివిక్రమ్ కూడా అనుకున్నారు. కానీ ఆ తరువాత మెచ్చుకున్నారు.
బాధకూడా పడతాను
హిట్ వచ్చినపుడు ఎంత సంతోషపడతానో, ఫ్లాప్ వచ్చినపుడు కూడా అంతే బాధపడతాను. జయాపజయాలను ఎలా తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లోనే వుంటుంది. ఈ వేసవికి విడుదలైన నా సినిమాలు తేరి, 24 మంచి విజయాలు అందుకున్నాయి. బ్రహ్మోత్సవం మాత్రం అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేకపోయింది.
పెళ్లి ఇప్పుడేనా..
పెళ్లి గురించి నేనేం చెప్పలేదు. ఇప్పటికే ఈ విషయంపై రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవి అందరూ ఊహించేసుకుని రాస్తున్నారు. చదివినవారు నిజమనుకుంటున్నారు. అంతే!
జనతాగ్యారేజ్
ప్రస్తుతం ‘యూ టర్న్’ అనే రీమేక్ చిత్రంలో నటిస్తున్నాను. పవన్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘జనతాగ్యారేజ్’ చిత్రంలో కూడా ప్రస్తుతం నటిస్తున్నాను.

-శ్రీ