వెయ్యికోట్లతో టాలీవుడ్ అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించేందుకు స్వదేశీ గ్రూప్ ముందుకొచ్చింది. దాదాపు 1000 కోట్లతో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధికోసం రివాల్వింగ్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు స్వదేశీ గ్రూప్ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ మోటూరి కృష్ణప్రసాద్ తెలియజేశారు. హైదరాబాద్‌లో మంగళవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో తమ స్వదేశీ గ్రూప్ నుంచి భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలను ఆయన వివరించారు. పరిశ్రమలో థియేటర్ల సమస్యతోబాటు విడుదల కాని చిత్రాలు చాలా ఉన్నాయని, ఈ సమస్యలను అధిగమించేందుకు తాము సన్నాహాలు చేస్తున్నామన్నారు. థియేటర్ల నిర్వహణ భరించలేక గోడౌన్లుగాను, మ్యారేజి హాల్స్‌గాను మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశీ షాపింగ్ మాల్స్‌లో రెండు థియేటర్లతోపాటు సూపర్ బజార్ హెల్త్‌కేర్ సెంటర్ ప్రారంభిస్తామన్నారు. దీంతోపాటు 24 శాఖలకు సంబంధించిన మీడియా అండ్ ఫిలిం ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌ను ప్రారంభిస్తామని, పరిశ్రమలో పెద్దలందరిని కలిపి ఓ అడ్వైజరీ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో వాశిరెడ్డి మనోజ్, రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.