మహేష్ సోదరి దర్శకత్వం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నటిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న మహేష్‌బాబు సోదరి మంజుల ఇప్పుడు మరో బాధ్యత తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకూ నటిగా షో, కావ్యాస్ డైరీ లాంటి చిత్రాల్లో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మహేష్ కథానాయకుడిగా నటించిన నాని, పోకిరితోపాటు షో, కావ్యాస్ డైరీ, ఏమాయ చేసావె తదితర చిత్రాల్ని నిర్మించారు మంజుల. ప్రస్తుతం నాని కథానాయకుడిగా తన దర్శకత్వంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు మంజుల సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో నాని నటిస్తున్న సినిమా పూర్తిఅయిన తర్వాత మంజుల దర్శకత్వంలో సినిమా మొదలవచ్చని సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలున్నాయి.