సీక్వెల్‌గా కాలింగ్‌బెల్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతంలో పన్నారాయల్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన కాలింగ్‌బెల్ చిత్రానికి సీక్వెల్ రూపొందుతోంది. ఈ చిత్రానికి కాలింగ్‌బెల్-2 అనే పేరును ఖరారు చేశారు. డ్రీమ్‌కేచర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అశోక్, రాజ్‌దలవాయి రూపొందించనున్నారు. ఈనెలలోనే ఈ సినిమా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, సాంకేతికంగా హై స్టాండర్డ్స్‌లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశామని, హాలీవుడ్ నుంచి కొంతమంది టెక్నీషియన్స్‌ని ఈ సినిమాకోసం ఉపయోగిస్తున్నామని తెలిపారు. మంచి కథనంతో ఈనెల్లోనే సినిమాను ప్రారంభిస్తున్నామన్నారు. కాలింగ్‌బెల్ విడుదలైనప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్ నిర్మిస్తానని తాను చెప్పానని, అనేకమంది రెండో చిత్రం గురించి అడిగినప్పుడు తనలో ఉత్సాహం మరింత పెరిగిందని దర్శకుడు పన్నారాయల్ అన్నారు. క్వాలిటీ విషయంలో రాజీపడకుండా నిర్మించే ఈ చిత్రంలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని ఆయన అన్నారు.