తెలంగాణ విజయగాథ... చండీయాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కాపాడడం కోసం ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం ఒక కారణజన్ముని సారథ్యంలో తెలంగాణ సమాజం సాగించిన విజయగాథను కథాంశంగా చండీయాగం అనే టైటిల్‌తో పూర్తిస్థాయి సోషియో ఫాంటసీ తరహాలో హెగియో గ్రాఫికల్ సినిమాగా నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుగుతున్నవేళ చండీయాగ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషంగా వుందని నిర్మాత తెలియజేశారు. వేల సంవత్సరాల ఘనమైన సంస్కృతి, చరిత్ర కలిగిన తెలంగాణాని, కొన్ని వందల సంవత్సరాలుగా బానిసత్వంలో మగ్గుతున్న పరిస్థితుల్లో అనేకమంది మహనీయులు తెలంగాణా విముక్తికోసం పరితపించారని, తెలంగాణ సమాజం ఆకాంక్షలకు ఆశాకిరణంగా అవతరించి, తెలంగాణకు స్వేచ్ఛావాయువులు అందించిన భరతమాత ముద్దుబిడ్డ, దైవాంశ సంభూతుడు, కారణజన్ముని ఆధ్యాత్మిక శక్తితో సాధించిన విజయగాథను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, గుర్తింపు పొందిన సాంకేతిక నిపుణులు, నటీనటులతో నిర్మించనున్నారు. జగదాంబ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీవెంకటాచారి ఎర్రోజు నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి యువ దర్శకుడు విశ్వన్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అందిస్తున్నారు. ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తారు. శ్రీవెంకటాచారి ఎర్రోజు మాట్లడుతూ, ప్రపంచానికి మార్గదర్శకుడిగా, యువతకు స్ఫూర్తిదాయకంగా సాగిన కారణజన్ముని విజయయాత్రను తెలంగాణ సమాజానికే కాకుండా యావత్ ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో అనేకమంది మేధావులు, మహనీయుల సలహాలు సూచనలతో, సహాయ సహకార పర్యవేక్షణలో గత సంవత్సరన్నరకాలంగా అత్యంత పకడ్బందీగా ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నామన్నారు. తెలంగాణ సమాజం మొత్తం ఒక పండగలా సంబురాలు చేసుకునే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భాన మా ‘చండీయాగం చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నామని, విశ్వన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని చెప్పారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలోమే తెలియజేస్తాం అని అన్నారు. బ్యానర్:జగదాంబ ప్రొడక్షన్స్, నిర్మాత:శ్రీవెంకటాచారి ఎర్రోజు, మాటలు:కవి సిద్ధార్థ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:విశ్వన్.