పవన్‌తో త్రివిక్రమ్ మరో సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం యస్.జె.సూర్య దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న పవన్‌కళ్యాణ్ త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి అంగీకరించినట్లు తెలిసింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ సినిమా వచ్చే నవంబర్ నుంచి ప్రారంభం అవుతుంది. పవన్‌కళ్యాణ్ త్వరలో సినిమాలు చేయడం మానేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. అందువల్ల పవన్ వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నారు. అందువల్ల ఎస్.జె.సూర్య సినిమా పూర్తయిన తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి ఫిక్స్ అయినట్టు తెలిసింది. అయితే గతంలో ప్రకటించినట్టు ఇది ‘కోబలి’ సినిమానా లేక వేరొక కథా అన్నది తెలియరాలేదు. పవన్‌కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు బ్లాక్‌బస్టర్స్ అయిన విషయం తెలిసిందే. మరి వీరిద్దరి హ్యాట్రిక్ కలయికలో తెరకెక్కే ఈ సినిమా వివరాలు త్వరలోనే విడుదల కానున్నాయి.