ఎక్కడికి పోతావు చిన్నవాడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిఖిల్, హేబాపటేల్, నందితాశే్వత ప్రధాన తారాగణంగా మేఘనా ఆర్ట్స్ నిర్మాణంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’. ఈ చిత్రానికి సంబంధించిన 80 శాతం షూటింగ్ పూర్తిచేశారు. కథానాయకుడు జన్మదినోత్సవ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు కొత్త తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడని, నిఖిల్ సెలక్టివ్‌గా నటించే చిత్రాలలో ఇదొకటని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్ లభించిందని, అతి త్వరలో టీజర్‌ను ఆడియోను విడుదల చేసి ఆగస్టులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వారు తెలిపారు. వెనె్నలకిషోర్, తనికెళ్ల భరణి, సత్య, తా.రమేష్, జోష్ రవి, వైవాహర్ష, సుదర్శన్, అపూర్వ, భద్రం, శ్రీనివాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీమణి, రామజోగయ్యశాస్ర్తీ, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, సంగీతం: శేఖర్ చందర్, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: సాయిశ్రీరామ్, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వి.ఐ.ఆనంద్.