కోడి రామకృష్ణ కొత్త ప్రయోగం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలతో విజువల్ ఎఫెక్ట్‌తో ఈతరం ప్రేక్షకుల్లోనూ తనకంటూ ఓ స్థానాన్ని స్థిరపరచుకున్నాడు కోడిరామకృష్ణ. ఇక తాజాగా ఇదే విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యంగా కన్నడలో ఆయన చేస్తోన్న ఓ అతిపెద్ద సాహసం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇండియన్ సినిమాలోనే ఈ తరహా విజువల్ ఎఫెక్ట్స్ వాడడం మొదటిసారిగా ప్రచారం జరుగుతోంది. కోడి రామకృష్ణ ప్రస్తుతం కన్నడలో ‘నాగరహవు’ అనే ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ దివంగత విష్ణువర్థన్‌ను విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తెరపై ఆవిష్కరిస్తున్నారు. 2009లో చనిపోయిన విష్ణువర్థన్‌ను ఇలా విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో తెరపై ఓ గ్రాఫిక్ క్యారెక్టర్ ఆవిష్కరించే ప్రయత్నం చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఇక విష్ణువర్థన్ గ్రాఫిక్ క్యారెక్టర్‌తో సినిమాలో ఎలా వుండనుందో పరిచయం చేస్తూ నిన్న విడుదలై టీజర్‌కు కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. 730 రోజులు, 7 దేశాలకు చెందిన విజువల్ ఎఫెక్ట్స్ నిపుణులు పనిచేసి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించినట్లు నాగరహవు టీమ్ తెలిపింది. రమ్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

చిత్రం విష్ణువర్థన్