వర్మ.. శర్మ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిబాబు, జూ.రేలంగి ప్రధాన తారాగణంగా బాబ్, బిందు బార్బి యువ జంటగా పాలిన్ డ్రోమ్ పిక్చర్స్ పతాకంపై భువన విజయ్ దర్శకత్వంలో ఫణిదుర్గప్రసాద్ రూపొందించిన చిత్రం ‘వర్మ వర్సెస్ శర్మ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి నిర్మాణానంతర కార్యక్రమాలు ముగించారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మాట్లాడుతూ పూర్తిగా గోదావరి జిల్లాల ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్య ప్రధానంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, మూఢ నమ్మకాలపై ఎక్కుపెట్టిన బాణంగా కథనం వుంటుందని తెలిపారు. ‘గోపాల గోపాల’, ‘పికె’ తరహాలో కామెడీ సెటైర్స్ హైలెట్‌గా వుంటాయని, వర్మ పాత్రలో గిరిబాబు, శర్మ పాత్రలో రేలంగి హాస్యం ప్రేక్షకులను నవ్విస్తుందని వారు తెలిపారు. హీరో తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రయత్నిస్తూ, చివరిలో ఏం సాధించాడు అనే అంశం థ్రిల్ కలిగించేలా చిత్రీకరించామని తెలిపారు. ఈ సినిమా ద్వారా వంద శాతం కామెడీని ఆశించవచ్చని, తప్పక విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని నిర్మాత దుర్గప్రసాద్ అన్నారు. దీక్షితులు, రమణ, అడ్డకర్ల బాబులు, ఉదయబాబు, తిరుపతిరావు, అజయ్, శ్రీరామ్, వాసు, బుల్లబ్బాయి, భారతి, లలిత, లక్ష్మీ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:రమణ రాథోడ్, కెమెరా:రంగ, ఎడిటింగ్:ప్రభు, పాటలు:రమణ, నిర్మాత:్ఫణిదుర్గప్రసాద్ (చినబాబు), రచన, దర్శకత్వం:్భవన విజయ్.