జైలులో గుడ్ ఈవెనింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో విజయవంతమైన నంబేండా చిత్రాన్ని తెలుగులో గుడ్ ఈవెనింగ్ పేరుతో అనువదించారు. నయనతార, ఉదయనిధి స్టాలిన్, సంతానం కాంబినేషన్‌లో ఎ.జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని భద్రకాళి ఫిలింస్ పతాకంపై భద్రకాళి ప్రసాద్ తెలుగులో అందిస్తున్నారు. ఈ చిత్రం గూర్చి ప్రసాద్ మాట్లాడుతూ, కథానాయిక జైలులో వుంటే ఆ కథనం ఎలా వుంటుంది అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని, హీరోయిన్‌ను ప్రేమించిన హీరో అష్టకష్టాలుపడి ఆమెను పెళ్లికి ఒప్పిస్తే, తాను జైలు జీవితం అనుభవించానంటూ ఆమె కథ చెబితే, ఆ హీరో ఎలా స్పందించాడు అన్న కథనంతో ఈ సినిమా సాగుతుందని తెలిపారు. ఆమె జీవితంలో భయంకరమైన నిజాలు ఏంటి? ఆమె ప్రేమను గెలిచేందుకు హీరో ఏం చేశాడు అన్నదే ఈ సినిమా కథాంశమని ఆయన తెలిపారు. సంతానం చేసిన కామెడీ కడుపుబ్బ నవ్విస్తుందని, కామెడీ, లవ్ యాక్షన్ లాంటి మూడు ఎలిమెంట్స్‌తో తమిళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన తెలిపారు. కరుణాకరన్, షాయాజీ షిండే తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:వెనె్నలకంటి, పాటలు:చంద్రబోస్, శివగణేశ్, సంగీతం:హారిస్ జయరాజ్, కెమెరా:బాలసుబ్రహ్మణ్యం, నిర్మాత:్భద్రకాళి ప్రసాద్, దర్శకత్వం:ఎ.జగదీష్.