లాయర్ పాత్రలో రవితేజ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రేజీ హీరో రవితేజ ‘బెంగాల్ టైగర్’ సినిమా తరువాత ఇప్పటివరకు మరే సినిమా చేయడం లేదు. ఇప్పటికే రెండుమూడు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్న కూడా ఇంకా ఆయన సినిమా మాత్రం సెట్స్‌పైకి తీసుకురావడం లేదు. దానికి కారణం ఈమధ్య ‘కిక్-2’ సినిమా సమయంలో రవితేజ బాగా సన్నగా కనిపించడంతో జనాలు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఆయన మళ్లీ బరువుపెంచే పనిలోపడ్డాడు. ఇప్పుడు రవితేజ ‘రాబిన్‌హుడ్’ అనే సినిమా త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. అలాగే చక్రి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో రవితేజ లాయర్‌గా కనిపిస్తాడని తెలిసింది. ఇప్పటివరకు రవితేజ లాయర్ పాత్ర చేయలేదు. తమిళంలో సూపర్‌హిట్ అయిన ‘మనిదన్’ అనే సినిమాకు ఇది రీమేక్ అని తెలిసింది. అయితే ఈ సినిమా అంతకుముందే హిందీలో ‘జాలి ఎల్‌ఎల్‌బి’ పేరుతో తెరకెక్కింది. మొత్తానికి రవితేజ లాయర్‌గా ఎలా అదరగొడతాడో చూడాలి!!