కుందనపుబొమ్మ వస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధాకర్, సుధీర్‌వర్మ, చాందిని చౌదరి ప్రధాన పాత్రల్లో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఎస్.ఎల్.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ముళ్ళపూడి వరా దర్శకత్వంలో జి.అనిల్‌కుమార్ రాజు, జి.వంశీకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘కుందనపుబొమ్మ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా ముళ్ళపూడి వరా మాట్లాడుతూ, ఇదొక విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ప్రేమకథ. బలమైన హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయన్నారు. జూన్ 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సుధాకర్ కొమ్మాకుల మాట్లాడుతూ, ఇదొక గొప్ప సినిమా అని, తన పాత్ర నిడివి చాలా తక్కువగా వున్నా మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్ర అని, తననుండి ప్రేక్షకులు ఆశించే ఓ విభిన్నమైన చిత్రమిదని, సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రమిది అని చెప్పారు.
సుధీర్‌వర్మ మాట్లాడుతూ, వరా ఓ బొమ్మను చెక్కినట్లుగా సినిమాను చెక్కారని, సూపర్ క్లాసికల్ విలేజ్ ఎంటర్‌టైనర్ ఇదన్నారు. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని గుర్తుచేసే విధంగా సినిమా వుంటుంది అని చెప్పారు. చాందిని చౌదరి మాట్లాడుతూ, తన కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి మంచి సినిమా రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ వున్న సినిమా ఇదని అన్నారు. నిర్మాతలలో ఒకరైన వంశీ మాట్లాడుతూ, ‘కుందనపుబొమ్మ’ రెండు సంవత్సరాల ప్రయాణమని, సంవత్సరంన్నరపాటు ఈ సినిమా స్క్రిప్ట్ కోసం పనిచేశామని, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, ఈ సినిమాలో మా ‘కుందనపుబొమ్మ’కు వచ్చిన సమస్యలేంటి? వాటిని ఎవరు తీర్చారనేదే ఈ సినిమా కథ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు:అనూరాధ ఉమర్జీ, గౌతం కశ్యప్, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే:కె.కె.వంశీ, శివ తాళ్లూరి, పాట లు:కీ.శే. శ్రీ ఆరుద్ర, శివశక్తి దత్తా, అనంత్ శ్రీరాం, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి:ఎస్. డి.జాన్, నిర్మాతలు:నిరంజన్, వంశీ, అనిల్, దర్శకుడు:ముళ్లపూడి వరా.