అభినేత్రి భయపెట్టదు .... తమన్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుదేవా, తమన్నా, సోనుసూద్ ప్రధాన పాత్రల్లో ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో కోన ఫిలిం కార్పొరేషన్, బ్లూసర్కిల్ కార్పొరేషన్, బిఎల్‌ఎన్ సినిమా, ఎంవివి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం ‘అభినేత్రి’. ఈ సినిమా ఫస్ట్‌లుక్, టీజర్ హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ, సినిమా టీజర్ అద్భుతంగా ఉందని, ‘అభినేత్రి’ అని టైటిల్ తమన్నాకు బాగా సూట్ అవుతుందని అన్నారు. ఇంతకుముందు తనతో రెండు సినిమాలు చేసిన అనుభవంతో చెప్తున్నానని, కోన వెంకట్ ఒక రోజు ఈ సినిమా కథ చెప్పడానికి ఫోన్ చేశాడని, మంచి కథ, నాకు బాగా నచ్చిందని, తెలుగు ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుందని అన్నారు. ప్రభుదేవా నాకు ఇష్టమైన వ్యక్తిఅని, తను హైదరాబాద్‌లో ఓ డాన్స్ స్కూల్ పెట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ, మంచి కథతో కూడుకున్న ఈ సినిమాలో తమన్నా ఎంతో ఎఫర్ట్ పెట్టి నటించిందని, ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ, ఒకరి కథను తీసుకొని రైటర్ అనేవాడు సినిమాను నిర్మించడం గొప్ప విషయమని, ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని చెప్పారు.
ప్రభుదేవా మాట్లాడుతూ, తాను బొంబాయి వెళ్తే డైరెక్టర్ అయిపోతానని, హైదరాబాద్ ఎంటర్ అయితే డాన్స్‌మాస్టర్ అయిపోతానని అన్నారు. ఈ సినిమా కథ నచ్చి తమిళంలో ప్రొడ్యూస్ చేస్తున్నానని అన్నారు. తమన్నా మాట్లాడుతూ, తాను అభినేత్రి స్థాయి వరకు రావడానికి కోనవెంకట్‌కూడా కూడా ఓ కారణమని, బాహుబలిలాంటి సినిమా తరువాత ప్రేక్షకులు తన నుండి కొత్తదనాన్ని కోరుకుంటున్నారని, అందుకే నేను ఈ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్నానని అన్నారు.
అందరూ అనుకుంటున్నట్టు ఇది హారర్ సినిమా కాదని, ఇది ఏ జోనర్‌కు చెందిన సినిమానో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పారు. దర్శకుడు విజయ్ మాట్లాడుతూ, ఈ సినిమా నాకు చాలా స్పెషల్. పాల్ లారెన్, నేను కలిసి కథ రాసుకున్నామని, ఈ సినిమా మొదలుపెట్టిన తరువాత మధ్యలో ఆపేసే పరిస్థితి ఏర్పడిందని, ఆ సమయంలో గణేష్ సహకరించారని అన్నారు. ఈ సినిమాలో ప్రభుదేవా పెర్‌ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని, తమన్నా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ వినగానే ఒప్పేసుకుందని, స్టోరీ తనకు అంత బాగా నచ్చింది అని చెప్పారు.