సిద్ధమైన గుప్పెడంత ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిరోనక్, అతిథిసింగ్ ప్రధాన తారాగణంగా ఐవింక్ ప్రొడక్షన్స్ పతాకంపై వినోద్ లింగాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గుప్పెడంత ప్రేమ. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు వినోద్ లింగాల మాట్లాడుతూ లవ్‌లోని మ్యాజిక్ ఎంత దూరాన్నైనా దగ్గర చేయగలదని, ప్రేమకోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొనేలా చేస్తుందని, అందరికీ ఆనందంతోపాటు మనసులకు చేరువయ్యేలా చేసే శక్తి ప్రేమలో ఉందని, అటువంటి కథనంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. కథలోని డైలాగ్స్, ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సరికొత్తగా ఉండి ప్రేక్షకులకు నచ్చుతాయని అన్నారు. షిల్లాంగ్, చిరపుంజి, మేఘాలయా తదితర ప్రాంతాలతోపాటుగా తూర్పు భారతదేశంలో వున్న అనేక అందమైన ప్రదేశాల్లో కన్నుల పండుగగా ఈ చిత్రాన్ని చిత్రీకరించామని అన్నారు. ఐదు పాటల్లో నాలుగు పాటలు అందరికీ నచ్చాయని, ముఖ్యంగా సఖియా సఖియా అనే పాట హైలెట్‌గా ఉంటుందని ఆయన తెలిపారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.