మెగా హీరోయిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది గ్లామర్ భామ రకుల్‌ప్రీత్‌సింగ్. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సక్సెస్ అందుకున్న ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందిపుచ్చుకుంటూ విజయాల్ని దక్కించుకుంటోంది. ఇప్పటివరకూ రకుల్ చేసిన సినిమాల్లో మెగా హీరోల సినిమాలే ఎక్కువ. దాంతో ఈమెకు మెగా హీరోయిన్ అనే ట్యాగ్ పడిపోయింది. ఇటీవలే రామ్‌చరణ్ సరసన బ్రూస్‌లీ, అల్లు అర్జున్ సరసన సరైనోడు చిత్రాల్లో నటించిన రకుల్ ప్రస్తుతం సాయిధరమ్‌తేజ్ సరసన ఓ చిత్రంలో, వరుణ్‌తేజ్ సరసన మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. మొత్తానికి నలుగురు మెగా హీరోలతో నటించిన రకుల్‌కు ఇక ముందు పవన్ సరసన కూడా నటించే చాన్స్ వస్తుందేమో చూడాలి! మొత్తానికి క్రేజీ సినిమాలతో తక్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్‌గా మారింది.