చిరుతో దీపిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి 150 చిత్రానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడే కొత్తకొత్తగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య కథానాయికగా నయనతార ఖరారైందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు మరో కొత్త పేరు వినిపిస్తోంది. నయనతార తర్వాత అనుష్క పేరు వినిపించినా వెనక్కెళ్ళింది. వీరందరినీ కాదని ఇప్పుడు బాలీవుడ్ భామ దీపికాపదుకొనే పేరు వినిపిస్తోంది. చిరంజీవి పక్కన నటించమని తననెవరూ అడగలేదని నయనతార చెప్పింది. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో కాల్షీట్లు ఎడ్జస్ట్ చేయటం కష్టమని, అనుష్క కూడా చెప్పేసిందని వార్తలు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ బ్యూటీ పొడుగుకాళ్ల సుందరి దీపికను ఎంపిక చేశారని వినిపిస్తున్న వార్త! అటు హాలీవుడ్, ఇటు బాలీవుడ్ చిత్రాలతో బిజీగా బిజీగా వున్న దీపిక ఈ సినిమా చేస్తుందా అన్నది కూడా ఓ అనుమానమే. కాకపోతే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంత పెద్ద కథానాయిక అయితేనే బాగుంటుందని నిర్మాత భావిస్తున్నాడట. ఏదైనా అట అటలే! త్వరలో ఏ సంగతీ తెలుస్తుందట!