సమంత మాటతోనే అ.. ఆ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయిక సమంత ఒక రోజు ‘మీ బ్రెయిన్ చాలా తెలివైనది. హృదయం ఎంతో మెత్తనైనది. ఎప్పుడు బ్రెయిన్‌తోనే కథాకథనాలు రాస్తారు. హృదయంతో ఎందుకు రాయరు?’ అని అడిగినప్పటినుండి ఆలోచిస్తూ ‘అ.. ఆ’ చిత్రాన్ని రాసుకున్నాను అని దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ ప్రధాన తారాగణంగా హాసిని అండ్ హారిక క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ రూపొందించిన ‘అ ఆ’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. యద్దనపూడి సులోచనారాణితో కొన్ని పాత్రల గురించి తాను మాట్లాడానని, అపుడే ఈ చిత్రంలో ఆమె పేరు వేయాలని అనుకున్నా అది కుదరలేదని, ఇప్పుడు దానిని జత చేశామని తెలిపారు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా తర్వాత ఏ సినిమా చేద్దామా అనుకుంటున్న సమయంలో పవన్‌కళ్యాణ్ నితిన్‌తో ఓ సినిమా బాకీ ఉన్నారని చెప్పడంతో ఈ చిత్రాన్ని రూపొందించామని అన్నారు.