నాని సరసన కీర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో హీరోయిన్‌గా నటించిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయం సాధించడంతో హీరోయిన్‌గా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం తమిళంలో బిజీ అయిన ఈమెకు అవకాశాలు ఎక్కువయ్యాయి. నటనతోపాటు గ్లామర్‌కు కొదవలేని కీర్తిసురేష్ తాజాగా ఓ చిత్రంలో నటించేందుకు ఓకే చెప్పింది. ఇటీవలే ‘్భలే భలే మగాడివోయ్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాని ప్రస్తుతం ‘జెంటిల్‌మెన్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన సినిమా చూపిస్తమావ ఫేమ్ త్రినాథ్‌రావు నక్కిన దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్‌గా కీర్తిసురేష్ ఓకే అయింది. నిజానికి ఈ పాత్రకోసం ముందు అవికాగోర్‌ను అనుకున్నప్పటికీ పాత్ర పరంగా కీర్తి అయితేనే బాగుంటుందని ఆమెతో చర్చలు జరిపారు. మరి ఈ సినిమా తర్వాత గ్లామర్‌భామ కీర్తి సురేష్‌కు తెలుగులో అవకాశాల జోరు పెరుగుతుందేమో చూడాలి.