వైజాగ్‌లో సినీ మ్యూజియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నిర్మాత రామానాయుడు పేరుతో విశాఖలో ‘మ్యూజియం ఆఫ్ సినిమా’ను ఏర్పాటు చేస్తామని, ఆయన పేరుమీద అవార్డును కూడా ప్రకటిస్తామని ఆయన తనయుడు, నిర్మాత సురేశ్‌బాబు అన్నారు. ఆదివారం తమ సొంత స్టూడియోలో రామానాయుడు జయంతి సందర్భంగా స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సురేశ్‌బాబు, తన తండ్రి పేరుతో మెదక్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయంలో నూతన పద్ధతులపై రైతులుకు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఈ ఏడాదినుంచి కొత్తనటీనటులు, సాంకేతిక నిపుణలను ప్రోత్సహించేలా చిన్నసినిమాలను నిర్మిస్తామని అన్నారు. రామానాయుడుకు సంబంధించిన వస్తువులను భద్రపరుస్తూ, సందర్శకులు చూసేలా విశాఖ మ్యూజియాన్ని రూపొందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్, రానా తదితరులు పాల్గొన్నారు.