ఇంటిలిజెన్స్ అధికారిగా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు నటించిన ‘బ్రహ్మోత్సవం’ ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడంతో ఇప్పుడు తన నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు మహేష్‌బాబు. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావచ్చాయి. ఈనెల చివర్లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలిసింది. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కే ఈ చిత్రంలో మహేష్‌బాబు ఇంటిలిజెన్స్ అధికారిగా కనిపిస్తాడు. అందుకోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ఈ ఆఫీస్ సెట్‌ను వేస్తారట. మహేష్ సరసన బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.