కేరళలో వానవిల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రేమ్‌కిరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన మలేషియా షెడ్యూల్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మా ట్లాడుతూ- ఓ వెరైటీ ప్రేమకథతో పేరుకు తగిన విధంగానే ఈ చిత్రాన్ని అందంగా, దృశ్యకావ్యంగా తీర్చిదిద్దుతున్నామని, ఓ చక్కని ప్రేమ జంట ఈ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. సినిమా కథతోపాటుగా స్క్రీన్‌ప్లే హైలెట్‌గా సాగే ఈ చిత్రానికి సంబంధించిన మలేషియా షెడ్యూల్ పూర్తిచేశామని, ఇప్పటివరకు అరవై శాతం పూర్తిచేశామని తెలిపారు. జూలై మొదటివారం నుండి కేరళలో మరో షెడ్యూల్ ప్రారంభించి పాటల చిత్రీకరణ జరుపుతామని, అదేనెల చివరివారంలో ఆడియో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హేమ, ప్రభాస్‌శ్రీను, సత్య, సురేఖావాణి, వేణు, ఫణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:ప్రభుప్రవీణ్, మాటలు: పవన్, కెమెరా: ఎస్.డి. జాన్, నిర్మాత: లంకా కరుణాకర్‌దాస్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: ప్రతీక్ ప్రమ్‌కరణ్.

చిత్రం ప్రతీక్, శ్రావ్య