గ్యారేజ్‌లో విదీష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లరి నరేష్ సరసన అత్తిలి సత్తిబాబు చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విదీషకు ఆ తర్వాత చేసిన సినిమాలు కెరీర్‌కు ఉపయోగపడలేదు. దాంతో తమిళంలో కూడా ప్రయత్నాలు సాగించిన ఈమె ఇటీవలే శ్రీకాంత్ సరసన దేవరాయ చిత్రంలో నటించింది. తాజాగా విదీష ఎన్.టి.ఆర్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఎన్‌టిఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జనతాగ్యారేజ్ చిత్రం ఇటీవల చెన్నయ్‌లో ఓ షెడ్యూల్‌ను పూర్తిచేసుకుంది. త్వరలోనే హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ని మొదలుపెట్టనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం విదీషను అడిగారట. కీలక పాత్ర కావడంతో చేయడానికి ఓకే చెప్పిందని తెలిసింది. ఎన్‌టిఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కిస్తున్నారు. మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 12న విడుదల చేస్తారట. మరి ‘జనతాగ్యారేజ్’తో అయినా విదీష ఫేట్ మారేనేమో చూడాలి!